7 Pharma colleges blacklisted

The Pharmacy Council of India has cracked the whip on seven pharmacy colleges in the state for admitting more students than permitted. With this, the one-upmanship between the All India Council for Technical Education and PCI over control of pharmacy colleges has taken a new turn.
The PCI has barred admissions to these colleges from the ensuing academic year 2012-13. The PCI has informed the state government that these colleges have violated the Education Regulation Act, 1999, by admitting more students than they were permitted and has asked the government to initiate action against them. It also asked the government not to include these colleges in Eamcet counselling next year.
The managements of these colleges claim that their intake is as approved by AICTE and that PCI’s diktat is unilateral and unjustified. They have urged the PCI to sort out the problem with AICTE. While PCI gives approval for 60 seats in a pharmacy college, AICTE has approved an intake of up to 200 seats. PCI’s contention is that AICTE has given indiscriminate approval to the increase in student intake without conducting proper inspections to see whether the infrastructure and faculty in the colleges is adequate.
Pharmacy Council of India has made it clear that it will not recognise the degrees awarded to students by colleges that gave admissions in excess of the number approved by PCI.

 SOURCE:DC


7 ఫార్మసీ కళాశాలల గుర్తింపు రద్దు

శుక్ర వారం, నవంబర్ 25, 2011 , 1:05 [IST]


పరీక్షలు నిర్వహించవద్దని వర్సిటీలకు సూచన
హైదరాబాద్‌, నవంబరు 24, ప్రభాతవార్త :      నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఏడు ఫార్మసీ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తూ ఫార్మసీ కౌన్సిల్ఆఫ్ఇండియా (పిసిఐ) నిర్ణయం తీసుకుంది. మేరకు కళాశాలలకు సమా చారం పంపటమేకాక, విద్యాసంస్థల వారికి ఎటువంటి పరీక్షలు నిర్వహించవద్దని సంబంధిత విశ్వవిద్యాలయాలకు స్పష్టం చేసింది. ఎపి ఫార్మసీ కౌన్సిల్కు సైతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పంపుతూ ఆయా కళాశాలల నుండి వచ్చే విద్యార్ధుల సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్సైతం చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. పిసిఐ గుర్తింపును కోల్పోయిన విద్యాసంస్ధల వివరాలను పరిశీలిస్తే మూడు కాలేజీలు హైదరాబాద్‌, పరిసర ప్రాంతాలలో ఉండగా, మిగిలిన నాలుగు సంస్ధలు జిల్లాల పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్బర్కత్పురాలోని రాజా వెంకట్రామిరెడ్డి ఉమెన్స్కాలేజ్ఆఫ్ఫార్మసీ, దూలపల్లి శివారు మైసమ్మ గూడా లోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ఆఫ్ఫార్మస్యూటికల్సైన్సెస్‌, పీరన్చెర్వు ప్రాంతంలోని షాదన్కాలేజ్ఆఫ్ఫార్మసీలు గుర్తింపు రద్దు అయిన జాబితాలో ఉన్నాయి. వరంగల్జిల్లా అనంతసాగర్లోని ఎస్ఆర్కాలేజ్ఆఫ్ఫార్మసీ, తూర్పు గోదావరి జిల్లా పెదతాడేపల్లిలోని వాసవి ఇన్స్టిట్యూట్ఆఫ్ఫార్మస్యూటికల్టెక్నాలజీ, కర్నూలు జిల్లా లక్ష్మిపురంలోని డాక్టర్కెవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ఆఫ్ఫార్మసీ, విశాఖ జిల్లా కాపుజగ్గారాజుపేటలోని విజ్ఞాన్ఇన్స్టిట్యూట్ఆఫ్ఫార్మస్యూటికల్టెక్నాలజీలకు సంబంధించి ఫార్మసీ చట్టం 1948 సెక్షన్‌ 13ను అనుసరించి గుర్తింపును రద్దు చేస్తూ పిసిఐ రిజిస్ట్రార్కమ్సెక్రటరీ అర్చన ముదుగల్ఉత్తర్వులు వెలువరించారు.
సాధారణంగా వ్యవస్ధనైనా పర్యవేక్షించటానికి ఒక అత్యున్నత బాడీ ఉంటుంది. అవి విద్యా సంస్ధలైనా, వ్యాపార సంస్థలైనా కావచ్చు. కాని ఫార్మసీ వ్యవస్థకు ఇద్దరిని పర్యవేక్షకులుగా పెట్ట టంతో సమస్య వచ్చి పడింది. ఒక ఇంజనీరింగ్కళాశాలకు అనుమతి కావాలంటే ఎఐసిటిఇ, విశ్వవిద్యాలయ గుర్తింపు ఉంటే సరిపోతుంది. మెడ ికల్కళాశాల స్థాపించాలంటే మెడికల్కౌన్సిల్ఆఫ్ఇండియా అనుమతి, యూనివర్శిటీ అఫిలియేషన్ఉంటే ఇబ్బంది లేదు. కాని ఒక ఫార్మసీ కళాశాల సంపూర్తి అనుమతులతో విద్యాబోధన చేయాలంటే మాత్రం ఎఐసిటిఇ అనుమతి, ఫార్మసీ కౌన్సిల్ఆఫ్ఇండియా గుర్తింపు, విశ్వవిద్యాలయం నుండి అనుబంధసంస్థగా అనుమతి పొందాలి. అప్పుడే కళాశాల నుండి జారీ అయ్యే దృవీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయి. కాని రాష్ట్రంలోని పలు కాలేజీలు చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని కేవలం ఎఐసిటిఇ అనుమతి మాత్రమే పొంది కళాశాలలను ప్రారంభిస్తున్నాయి. ఫార్మసీ కౌన్సిల్ఆఫ్ఇండియా గుర్తింపు లేకుండానే క్లాసులు ప్రారంభిస్తూ పుణ్యకాలాన్ని కాస్తా ముగించేసి, ఉండీ ఉపయోగం లేని సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. దీంతో అసలు లోపం ఎక్క డుందో తెలియక విద్యార్థులు ఇక్కట్ల పాలవు తున్నారు.
 నిబంధనల మేరకు కొన్ని రకాల కోర్సులు చదవటం ఒక ఎత్తు అయితే వాటిని సక్రమంగా రిజిస్టర్చేయించు కోవటం అత్యంత కీలకమైనది. లాకోర్సు చేసిన ప్రతిఒక్కరూ బార్కౌన్సిల్ఆఫ్ఇండియా నిబంధనల మేరకు, ఎంబిబిఎస్చదివినవారు మెడికల్కౌన్సిల్ఆఫ్ఇండియా నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్చేయించుకుంటేనే అర్హత సంపాదిస్తారు. ఫార్మసీ విషయంలోనూ ఇదే పరిస్ధితి ఉంది. డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ ఇలా కోర్సు చేసినా వారు ఫార్మసీ కౌన్సిల్వద్ద తిరిగి రిజిస్ట్రేషన్చేయించుకోవాలి. అప్పుడే దానికి చట్టబద్ధత వస్తుంది. కాని కేవలం లాభాపేక్ష, వ్యాపార ధోరణే ధ్యేయంగా వెలుస్తున్న కాలేజీలు ఇస్తున్న సర్టిఫికేట్లు పిసిఐ నిబంధనలకు విరుద్ధం అయినందున అవి అయా రాష్ట్రాల కౌన్సిల్స్లో నమోదు కావటం లేదు. ప్రధానంగా రాష్ట్ర పార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్లేకపోతే సంబంధిత అభ్యర్ధి భవిష్యత్తులో ఏమీ చేయలేని పరిస్ధితి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల మొదలు, కనీసం ఒక మెడికల్షాపు పెట్టుకుందామన్నా రిజిస్టర్డ్ఫార్మసిస్టు కావలసిందే. అటు క్లీనికల్రీసెర్చ్మొదలు, మల్టినేషనల్కంపెనీల వరకు అందరూ రిజిస్ట్రేషన్అడుగుతారు. నిజానికి 1987కు ముందు ఎఐటిఇసి చట్టం లేదు. అప్పటికి మిగిలిన అన్ని వ్యవస్ధల మాదిరిగానే ఫార్మసీ వ్యవహారాలను ఫార్మసీ కౌన్సిల్ఆఫ్ఇండియా నిర్వర్తిస్తూ వచ్చేది. కాని తరువాత ఇరుసంస్ధల నిర్వహణ విధానాన్ని తీసుకురావ టంతో కాలేజీలు తమకు అనుకూలమైన వ్యవస్ధ చెంతకు చేరుతున్నాయి. ఎఐసిటిఇలో అనుమతి తెచ్చుకోవటం అంటే పెద్ద విషయం కాదన్నది జగమెరిగిన సత్యం. అక్కడి అవినీతి ఫలితంగా ఇది సుసాధ్యం. కాని ఎఐసిటిఇతో పోల్చితే ఫార్మసీ కౌన్సిల్పరిస్ధితులు వేరు. ఇక్కడ అవినీతి లేదని చెప్పలేము కాని అక్కడితో పోల్చితే కొంత తక్కువ. నిబంధనలు ఎక్కువ. దీంతో కళాశాల యాజమా న్యాలు తమదైన శైలిలో ఎఐసిటిఇ అనుమతి పొందుతున్నాయి. నిబంధనలు తప్పనిసరి అనే ఫార్మసీ కౌన్సిల్ను పక్కన పెడుతున్నాయి.
కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే పాలకులు నిబంధనల విషయంలో పునరాలోచించ వలసి ఉంటుంది. మెడికల్కౌన్సిల్అనుమతి లేకుండా మెడికల్కాలేజీ ప్రారంభించే పరిస్ధితి లేని విధంగానే, ఫార్మసీ కాలేజీ ప్రారంభించాలన్నా ఫార్మసీ కౌన్సిల్ఆనుమతిని తప్పని సరి చేయాలి. అప్పుడు పుట్టగొడుగుల్లా కాలేజీలు వెలిసే అవకాశం ఉండదు. మరోవైపు కేంద్రప్రభుత్వం అసలు ార్మసీ విద్య టెక్నికల్కోర్సా, లేకుంటే ఆరోగ్య రంగానికి సంబంధించిన వృత్తి విద్యాకోర్సా అన్న దానిని తేల్చాలి. 2003లో స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎఐసిటిఇ నుండి ఫార్మసీకి విముక్తి కలిగించాలని సూచించినా ఫలితం లేదు. దేశ వ్యాప్తంగా 1600 ఫార్మసీ కాలేజీలు ఉండగా, కేవలం మనరాష్ట్రంలోనే దాదాపు 320 కాలేజీలు నడుస్తున్నాయి.
ప్రస్తుతం గుర్తింపు రద్దు బారిన పడిన కాలేజీలు ఒకరకంగా చెప్పాలంటే నాణ్యత కలిగినవే. అందు వల్లే ఇక్కడ పూర్తి స్ధాయిలో విద్యార్ధులు చేరారు. 120 నుండి 180 వరకు ఉన్న సంఖ్యకు అను మతులను ఇచ్చింది ఎఐసిటిఇ కాగా, ఫార్మసీ కౌన్సిల్అనుమతి 60 సీట్లకే ఉంది. దీనిని తప్పుపడుతూ పిసిఐ కళాశాలల అనుమతులను రద్దు చేసింది. మిగిలిన కళాశాలలు సైతం తీరుగా 120-180 సీట్లకు అనుమతి పొందినా అక్కడ విద్యార్ధులు జాయిన్కాలేదు. నేప ధ్యంలో మల్లారెడ్డి విద్యాసంస్ధల అధినేత మాలా ్లరెడ్డి 'ప్రభాతవార్త్ఞతో మాట్లాడుతూ తాము కౌన్సి లింగ్ద్వారానే విద్యార్ధులను చేర్చుకున్నామని, నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని అన్నారు. ఇటీవల హైదరాబాద్వచ్చిన ఎఐసిటిఇ ఛైర్మన్డాక్టర్జిఎస్ఎస్మంత మాట్లాడుతూ ఫార్మసీ యాక్టు పురాతనమైనదని, ఒకసారి పార్లమెంటులో ఒకే విషయంపై రెండో చట్టం వస్తే మొదటిది అటోమెటిక్గా రద్దు అయినట్లేనని చెబుతున్నారు. తద్వారా నూతనంగా వచ్చిన ఎఐస ిటిఇ చట్టం మాత్రమే అమలులో ఉంటుందన్నది ఆయన వాదన. ఎపి ఫార్మసీ కౌన్సిల్ఛైర్మన్అన్న పరెడ్డి విజయభాస్కర రెడ్డి 'ప్రభాతవార్త్ఞతో మాట్లా డుతూ వివాదంపై తాము జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించి చట్టసవరణకు ప్రయత్నిస్తా మని, ప్రక్రియలో కళాశాలల యాజమాన్యాలను కూడా భాగస్వాములను చేస్తామని అన్నారు. నిబం ధనలలో ఉన్న లొసుగుల ఫలితంగా విద్యార్ధులు నష్టపోరాదన్నదే తమ అభిమతమన్నారు. పిసిఐ గుర్తింపు కోల్పొయిన విద్యాసంస్ధలకు 2012- 2013 విద్యాసంవత్సరం నుండి ఇది వర్తిస్తుంది.